- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదిలో ఫస్ట్ క్లాస్.. అభినందించిన జనసురక్ష ఫౌండేషన్ అధ్యక్షులు
ముసాపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవతరగతి ఫలితాలలో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10/10 మొదటి ర్యాంక్ సాధించిన బి.వైష్ణవిని జనసురక్ష ఫౌండేషన్ అధ్యక్షులు బీజేపీ దేవరకద్ర బాలన్న అభినందించారు.

దిశ, అడ్డాకుల : ముసాపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవతరగతి ఫలితాలలో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10/10 మొదటి ర్యాంక్ సాధించిన బి.వైష్ణవిని జనసురక్ష ఫౌండేషన్ అధ్యక్షులు బీజేపీ దేవరకద్ర బాలన్న అభినందించారు. వారి తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారిని అన్నివిధాలుగా ప్రోత్సహించి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు జనసురక్ష ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.
రూ.5,000 ప్రోత్సాహక బహుమానంగా విద్యార్థినికి అందచేశారు. దేవరకద్ర నియోజకవర్గం స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద మధ్య తరగతి విద్యార్థులు జనసురక్ష ఫౌండేషన్ సభ్యులను సంప్రదిస్తే వారికి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడానికి దోహద పడతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసురక్ష ఫౌండేషన్ సభ్యులు బుచ్చన్న యాదవ్, అంజన్ యాదవ్, రాగుల శివ, వినోద్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






