రణం కంటే రాజీయే బెట‌ర్ : ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల రూరల్ : రణం కంటే రాజీయే నయమని, సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని, కక్ష. కార్ప ణ్యాలతో ఏమీ సాధించలేరని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత అన్నారు.

రణం కంటే రాజీయే బెట‌ర్ : ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత
X

దిశ, గద్వాల రూరల్ : రణం కంటే రాజీయే నయమని, సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని, కక్ష. కార్ప ణ్యాలతో ఏమీ సాధించలేరని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత అన్నారు. గద్వాల కోర్టు ఆవరణలో శనివారం జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 139 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు(05), క్రిమినల్ కేసులు ( 127 ), ఎన్.ఐ. యాక్ట్ కేసులు (07) వంటి కేసులు ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడ్డాయి. లోక్ అదాలత్లో భాగంగా వివిధ కేసులకు సంబంధించి ఇరువర్గాలతో రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు న్యాయమూర్తి చెప్పారు. ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో, సౌహార్దపూర్వకంగా న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలియజేశారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకొని తాము ఎదుర్కొంటున్న కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి యస్. రవి కుమార్, పోక్సో కోర్టు జడ్జి వి. శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి యన్.వి. హెచ్.పూజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి యు. ఉదయ్ నాయక్, న్యాయవాదులు పాల్గొన్నారు.

Next Story