పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయండి

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-23 11:06:49  IST  )

మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు వెంటనే పూర్తి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ విజ్ఞప్తి చేశారు.

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయండి
X

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయండి

- ఎంపీ డీకే అరుణ

- కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్నను కలిసి ఎంపీ విజ్ఞప్తి

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు వెంటనే పూర్తి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్న ను కలిసి పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల వివరాలను సమర్పించారు. తన పార్లమెంటు పరిధిలో ఆర్వోబీల నిర్మాణం అవశ్యకత, జిల్లా ప్రజలకు ఉపయోగాలు, ప్రయోజనాలను వివరిస్తూ, ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలోని టీటీడీ గుట్ట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి యుద్ద ప్రాతిపదికన చేపట్టి త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని కోరగా, ఇందుకు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు.

Next Story