- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా ఆసుపత్రిని సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్
by Taduka Kalyani |
నారాయణపేట జిల్లా ఆసుపత్రిని గురువారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ సందర్శించారు.

X
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా ఆసుపత్రిని గురువారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు అందించారు.
ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించి ఆపరేషన్ చేసుకున్న బాలింతలతో మాట్లాడుతూ కేసీఆర్ కిట్ అందించారా.. భోజనం అందిస్తున్నారా... వైద్య సేవలు ఎలా అందుతున్నాయా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రాం మనోహర్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంజిత్, అనస్టేషియా డా. మల్లికార్జున్, ఆర్ఎంఓ డాక్టర్ పావని, నర్సింగ్ సూపరిండెంట్ డా. సరోజ తదితరులు ఉన్నారు.
Next Story






