- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో-బైకు ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
by Ratna Kumari |
మండల పరిధిలోని పులగచర్ల-కల్వరాల గ్రామాల మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

X
దిశ, వీపనగండ్ల : మండల పరిధిలోని పులగచర్ల-కల్వరాల గ్రామాల మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దిలేటి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. పుల్గర్చర్ల గ్రామానికి చెందిన గిద్దల్ చంద్రయ్య కూలీలను ఆటోలో వీపనగండ్లకు తీసుకెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తీవ్రతకు బైక్ పూర్తిగా దెబ్బతినగా.. వాహనదారుడు మద్దిలేటికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం గాయపడిన యువకుడిని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Next Story






