ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్ విజయేందిర బోయి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గురువారం ఉదయం బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి పెట్రోల్ పంపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గా

ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన  కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గురువారం ఉదయం బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి పెట్రోల్ పంపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయాలపాలై, షాద్ నగర్ బుగ్గారెడ్డి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణపేట జిల్లా, మరికల్ కళాశాల విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పరామ‌ర్శించి వారికి ధైర్యం చెప్పి మాట్లాడారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్, ఆర్టీఓ రఘు లు దగ్గరుండి పర్యవేక్షించారు. విద్యార్థినిలకు భోజనం చేయించి, పండ్లు అందించి, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని డాక్టర్లతో నిర్ధారించుకున్న తర్వాత వారిని వారి వారి స్వస్థలాలకు పంపించినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు.

Next Story