అంగ‌న్ వాడీల్లో హాజరు శాతం పెంచుతూ పని తీరు మెరుగుపర్చాలి :కలెక్టర్ విజయేందిర బోయి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలలో హాజరు శాతం పెంచుతూ, పనితీరు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం విసి కాన్ఫరెన్స్ హాల్ లో

అంగ‌న్ వాడీల్లో  హాజరు శాతం పెంచుతూ పని తీరు మెరుగుపర్చాలి :కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలోని అంగన్ వాడి కేంద్రాలలో హాజరు శాతం పెంచుతూ, పనితీరు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం విసి కాన్ఫరెన్స్ హాల్ లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ లు, సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్షిస్తూ మాట్లాడారు. గ్రామంలో అంగన్వాడి కేంద్రాలకు ఎంత మంది హాజరు అవుతున్నారు? పాఠశాలకు ఎంత మంది వెళుతున్నారన్న విషయాలపై స్పష్టత కలిగి ఉండాలని, గ్రామంలో ఉన్న పిల్లల సర్వే చేస్తూ, వారు అంగన్వాడి లేదా పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. బరువు, పోషక లోపం ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించి సాధారణ స్థితి కి తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిడబ్ల్యూఓ జరీనా బేగం పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించని మండలాలు, గ్రామాల్లో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం విసి హాల్ నుండి ఎంపీడీఓ, ఎంపిఓలు, డిఆర్డీఏ డిపిఎం లు,ఏపిఎం లు, సీఓ లతో కలెక్టర్ వెబెక్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలు, మహిళా శక్తి కార్యక్రమాలు, బ్యాంకు లింకేజీ కార్యక్రమాలపై ఆమె సమీక్షించారు. ధాన్యం సేకరణ పై దృష్టి పెట్టాలని, రైతులు వేచి ఉండకుండా తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి మిల్లుకు పంపించాలని ఆమె ఆదేశించారు. స్వయం సహాయక కొత్త గ్రూప్ లను ఈనెల 30 లోగా ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసిన గ్రూప్ లకు వారం రోజుల్లో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. మహిళా శక్తి ద్వారా టార్గెట్ ప్రకారం పెండింగ్ యూనిట్ లు గ్రైండింగ్ చేయాలని సూచించారు. వీసీ లో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్డీఓ నర్సింహులు ఉన్నారు.

Next Story