ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ అక‌స్మిక త‌నిఖీ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, గోపాల్ పేట : జిల్లాలో వ‌ర్షాల ప్ర‌భావం కొన‌సాతున్న వేళ‌.. ఆసుప‌త్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాల్ పేట మండల కేంద్రంలోని

ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ అక‌స్మిక త‌నిఖీ
X

దిశ‌, గోపాల్ పేట : జిల్లాలో వ‌ర్షాల ప్ర‌భావం కొన‌సాతున్న వేళ‌.. ఆసుప‌త్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాల్ పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదేవిధంగా మలేరియా, డెంగ్యూ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో రూపొందించిన హెల్త్ యాప్ లో టీబీ స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్ కు సంబంధించిన రిపోర్టులను అప్ లోడ్ చేయాలని.. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు రోగులకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, వైద్యాధికారులు పరిమళ, చాంద్ పాషా,వైద్య సిబ్బంది, త‌హ‌శీల్దార్ తిలక్ కుమార్ రెడ్డి, ఆర్ఐ ప్రసన్న, పంచాయతీ సెక్రెటరీ బాలరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రాము పాల్గొన్నారు.

Next Story