బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

by Elthuri vijay kumar |

హాస్టల్ లో వసతులు కల్పించాలని, బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశాలు

బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
X

బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

- హాస్టల్ లో వసతులు కల్పించాలి

- బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశాలు

దిశ, గోపాల్ పేట: గోపాల్ పేట మండల కేంద్రంలో వసతి గృహాల్లో బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను హాస్టల్ వార్డెన్ జీవితను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వసతి గృహంలో వర్షం నీరు చేరి ఇబ్బందులు కలిగాయని వార్డెన్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రహరీ నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాలని ఆమె కోరారు. స్పందించిన కలెక్టర్ వసతి గృహంలో శిథిలావస్థలో ఉన్న సమస్యలతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు భోజనం విషయంలో నాణ్యత పాటించాలని, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత నిరంతరం పాటించాల్సిందిగా ఆదేశించారు.ఎంపీడీవో భావని, ఎమ్మార్వో పాండు, హాస్టల్ వార్డెన్ జీవిత తదితరులు పాల్గొన్నారు.

Next Story