- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరి ధాన్యం కొనుగోలుకు సిద్ధం : కలెక్టర్ సంతోష్
దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో వానకాలం వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో వానకాలం వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం షామియానా, తాగునీరు, విద్యుత్ వసతి, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకత పాటించి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోళ్లు జరగాలన్నారు. తేమ శాతం 17 లోపు ఉంచి ధాన్యం కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గన్ని బ్యాగులు, రవాణా వసతులు సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు అనంతరం 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369గా ప్రభుత్వం నిర్ణయించిందని, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, డీఆర్డిఓ చిన్న ఓబులేసు, సివిల్ సప్లై డిఎం రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సిరంజిత్ సింగ్, జిల్లా కోపరేటివ్ అధికారి, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.






