కూలిన అంజన్న జాతర తోరణం

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : పడమటి ఆంజనేయ స్వామి తిరుణాల తోరణం ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ సంఘటన

కూలిన అంజన్న జాతర తోరణం
X

దిశ‌, మ‌క్త‌ల్ : పడమటి ఆంజనేయ స్వామి తిరుణాల తోరణం ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో ఎవరు గాయపడలేదు. ఈ సంఘటన జాతీయ రహదారి నల్లజానమ్మ మందిరం కూడలిలో ఆదివారం రాత్రి జ‌రిగింది. పట్టణంలో నల్లజానమ్మ మందిరం కూడలి దగ్గర రాయచూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పడమటి అంజన్న తిరుణాల ఆహ్వాన తోరణ కమానుకు ఓ భారీ వాహనం రాసుకుంటు వెళ్ల‌డంతో తోరణం బోర్డు అకస్మాత్తుగా రోడ్డుపై కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో రహదారి పై వాహనాలు రాకపోకడలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మక్తల్ పోలీసు అధికారులు తక్షణమే స్పందించి అప్రమత్తమై, జేపీసీ సహాయంతో తోరణాన్ని తొలగించి మార్గాన్ని క్లియర్ చేశారు. ఈ సందర్భంలో మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, మక్తల్ కానిస్టేబుల్స్‌ ఉన్నారు.

Next Story