ఈనెల 17న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కి సీఎం రాక

by Ratna Kumari |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 17న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపుగా 12 వేల కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

ఈనెల 17న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కి  సీఎం రాక
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 17న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపుగా 12 వేల కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో ప్రత్యేకంగా కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రావాల్సిందిగా సీఎం కి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 17న పర్యటనను ఖరారు చేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో ఏర్పాట్లు ముమ్మ‌రంగా జరుగుతున్నాయి.

Next Story