- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
డిసెంబర్ 1న మక్తల్ పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు, మున్సిపల్ అధికారులతో పరిశీలించారు.

దిశ, మక్తల్ : డిసెంబర్ 1న మక్తల్ పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు , మున్సిపల్ అధికారులతో పరిశీలించారు. ఎస్పీ పట్టణంలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో పబ్లిక్ మీటింగ్ సమావేశ స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు, బందోబస్తుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏర్పాటు చేయాలని, బందోబస్తును సెక్టార్లుగా విభజించి తగిన భద్రత, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జర్గకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, సమావేశ స్థలంలో ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీటింగ్ స్థలంలో, హెలిప్యాడ్ స్థలం వద్ద బరికెట్స్ తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సిఎం బందోబస్తుకు ఇతర జిల్లాల నుండి వచ్చే పోలీసు ఫోర్స్ వస్తుందని పార్కింగ్ ప్రాంతాలను ప్రజలు, వీఐపీల వాహనాల కోసం విడివిడిగా గుర్తించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేస్తున్నామని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్పీ వీనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నల్లపు లింగయ్య, సిఐ రామ్ లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.






