సీఎంఆర్ఎఫ్ చెక్కు చించేసి సీడీసీ చైర్మ‌న్ నిర‌స‌న

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం, విమర్శించడం సహజమే. కానీ అధికార పార్టీకి చెందిన నేతనే ప్రభుత్వంపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం

సీఎంఆర్ఎఫ్ చెక్కు చించేసి సీడీసీ చైర్మ‌న్ నిర‌స‌న
X

దిశ, కామారెడ్డి : అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం, విమర్శించడం సహజమే. కానీ అధికార పార్టీకి చెందిన నేతనే ప్రభుత్వంపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఇర్షాదుద్దీన్ తన సోదరికి సంబందించిన సీఎం సహాయ నిధి చెక్కును చించేసి నేరుగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన కథనం మేరకు...తన చెల్లెలు నేహా బేగం 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై దీర్ఘకాలంగా చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే చికిత్సకు రూ.32 లక్షలు ఖర్చు కావడంతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేశారు. ఆసుపత్రి వైద్య ఖర్చులు 32 లక్షలు కాగా సంబంధిత బిల్లులను పొందుపరుస్తూ దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.60 వేలు మాత్రమే ఇస్తూ చెక్కు ఇచ్చింది. దీంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 32 లక్షలకు దరఖాస్తు చేస్తే కేవలం 60 వేలు రావడంతో ఆ చెక్కు తమకు అవసరం లేదని చించేసి తన ఆవేదనను వెళ్లగక్కారు. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అధికార పార్టీకి చెందిన నేతనే చించేయడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. ఆసుపత్రుల్లో అయిన బిల్లులో కనీసం 20% కూడా ఇవ్వడం లేదని ఇప్పటికే పలువురు బాహటంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతనే ప్రభుత్వంపై విరుచుకుపడడంతో అందరూ అతనికి బాసటగా నిలుస్తున్నారు.

Next Story