సెప్టెంబర్ 3న మూసాపేటకు సీఎం రేవంత్ రాక

by velandi.Saikiran |

సెప్టెంబర్ 3వ తేదీన మూసాపేట మండలంలో పర్యటించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్జిడి ఫార్మ ఇండియా

సెప్టెంబర్ 3న మూసాపేటకు సీఎం రేవంత్ రాక
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : సెప్టెంబర్ 3వ తేదీన మూసాపేట మండలంలో పర్యటించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్జిడి ఫార్మ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రెండవ యూనిట్ ప్రారంభోత్సవంతో పాటు.. మూసాపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్నాయి. ఈ మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాతావరణ పరిస్థితులను బట్టి హెలికాప్టర్ ద్వారా కానీ, లేదా రోడ్డు మార్గాన కానీ వస్తారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్, ఎస్పీ జానకి ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్సై వేణు తదితరులు ఉన్నారు.

Next Story