- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంట్లవెల్లిలో భారీ సభకు ఏర్పాట్లు తుది దశలో..
ఈ నెల 18వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.

దిశ, పెంట్లవెల్లి : ఈ నెల 18వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న రూ.200 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (IRS) నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం సీఎం రానున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పలు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సుమారు 30,000 మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. రేపు మంగళవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సభ స్థలాన్ని స్వయంగా పరిశీలించనున్నారని కూడా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో కొల్లాపూర్ ఆర్డీవో బాన్స్‌లాల్, ఎంపీడీవో దేవేందర్, ఎమ్మార్వో విజయ్ సింహ, కాంగ్రెస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ భీమిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






