రేపు కొల్లాపూర్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇలా..!

by Bhanu |   (  Updated:2025-07-17 14:49:35  IST  )

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు సిద్ధ

రేపు కొల్లాపూర్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇలా..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు సిద్ధమవుతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఈ నియోజకవర్గాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం విశేష ఏర్పాట్లు చేపట్టింది.

ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 1:45కి పెంట్లవెల్లి మండలం జటప్రోల్ చేరుకుంటారు. అక్కడ 1:55 నుంచి 2:10 వరకు మదన గోపాలస్వామి దేవాలయం సహా చుట్టుపక్కల ఉన్న ఇతర ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం 2:10 నుంచి 2:20 వరకు యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

వెంటనే 2:20 నుంచి సాయంత్రం 4:15 వరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తారు. కార్యక్రమాలు ముగిశాక సాయంత్రం 4:30కు సీఎం హెలికాప్టర్‌ ద్వారా తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు.

Next Story