రేప‌టి నుంచి సీఎం క‌ప్ మండ‌ల స్థాయి క్రీడా పోటీలు

by Nallavelli.Anjaneyulu |

మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ బుధవారం 4న నిర్వహిస్తున్నట్లు పీడీలు మంజుల, సుచేతన్ తెలిపారు.

రేప‌టి నుంచి సీఎం క‌ప్ మండ‌ల స్థాయి క్రీడా పోటీలు
X

దిశ, అడ్డాకుల : మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ బుధవారం 4న నిర్వహిస్తున్నట్లు పీడీలు మంజుల, సుచేతన్ తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సంబంధిత రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా తీసుకొని రావాలని తెలిపారు. ఇవాళ‌ క్రీడా ప్రాంగణాన్ని ఎంఈఓ ప్రకాశ్ పరిశీలించారు. రేప‌టి నుంచి జ‌రుగ‌నున్న మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలకు క్రీడా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ నుంచి విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ప్రతి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులను రేపు జరిగే క్రీడా పోటీలకు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పీడీలను పంపించాల‌ని ఆయన సూచించారు. ఉదయం 8:30 గంట‌ల‌కు విద్యార్థులు జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణానికి చేరుకోవాలని ఎంఈఓ తెలిపారు.

Next Story