బాలనగర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ...!

by Ratna Kumari |

రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థులు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ భయానక వాతావరణం సృష్టించిన ఘటన బాలనగర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటు చేసుకుంది.

బాలనగర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ...!
X

దిశ, జడ్చర్ల : రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థులు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ భయానక వాతావరణం సృష్టించిన ఘటన బాలనగర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటు చేసుకుంది. బాలనగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మొదటి సంవత్సరం విద్యార్థులు రాత్రి భోజనం చేశాక ప్లేట్లు చేతులు కడిగే సందర్భంలో ఇరువురి మధ్య మొదలైన ఘర్షణ ఒకరిపై ఒకరు చేయి చేసుకుని కొట్టుకునేదాకా వెళ్ళింది ఈ విషయాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థులను వారి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది దీంతో రాత్రి మొత్తం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే అరుపులు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు దీంతో పాఠశాలలోనే మిగతా విద్యార్థులు ఉదయం వరకు భయంతో బిక్కుబిక్కుమంటూ జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పాఠశాల వద్ద చేరుకున్న కానిస్టేబుల్ సమక్షంలో ఇరువురి విద్యార్థులను మందలించి పాఠశాల నుండి ఇంటికి పంపించారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఉపాధ్యాయుల మాట వినకపోవడంతో పాటు వారిపైనే దాడి చేసే విధంగా మారడానికి కారణం ఏమై ఉంటుందని పాఠశాలలోని ఉపాధ్యాయుల భయం లేకపోవడం క్రమశిక్షణ నేర్పించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి మరో మారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసి పాఠశాలలో మిగతా విద్యార్థులకు రక్షణ కల్పించాలని పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

విద్యార్థులు కట్టుకున్న విషయం వాస్తవమే : పాఠశాల ప్రిన్సిపాల్

పాఠశాలలో విద్యార్థులు భోజనానంతరం ప్లేట్లు కడిగే సందర్భంలో ఓ విద్యార్థి చేతిలో నుండి ప్లేట్ కింద పడడంతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థుల మధ్య మాట పెరిగి ఒకరిని ఒకరు దూషించుకొంటూ కొట్టుకున్నారని విషయాన్ని గమనించిన వెంటనే తనతో పాటు సిబ్బంది మొత్తం విద్యార్థులను నిలవరించి ప్రయత్నం చేశామని రాత్రి మొత్తం ఇక్కడే ఉండి విద్యార్థుల మధ్య ఎలాంటి చూసామని ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో పాటు విద్యార్థులను వారి ఇంటికి పంపించామని పాఠశాల ప్రిన్సిపాల్ సుభాష్ చంద్ర శుక్ల తెలిపారు.

Next Story