కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబ‌ర్ కోడ్ లు ర‌ద్దు చేయాలి : సీఐటీయూ జిల్లా కార్య‌ద‌ర్శి వి న‌ర‌సింహ

by Ratna Kumari |

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన నాలుగు లేబ‌ర్ కోడ్ లు ర‌ద్దు చేయాల‌ని సీఐటీయూ జిల్లా కార్య‌ద‌ర్శి వి.వి. న‌ర‌సింహ పేర్కొన్నారు. గురువారం మ‌ల్ద‌కల్ మండ‌ల కేంద్రంలో

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబ‌ర్ కోడ్ లు ర‌ద్దు చేయాలి :  సీఐటీయూ జిల్లా కార్య‌ద‌ర్శి వి న‌ర‌సింహ
X

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన నాలుగు లేబ‌ర్ కోడ్ లు ర‌ద్దు చేయాల‌ని సీఐటీయూ జిల్లా కార్య‌ద‌ర్శి వి.వి. న‌ర‌సింహ పేర్కొన్నారు. గురువారం మ‌ల్ద‌కల్ మండ‌ల కేంద్రంలో సీఐటీయూ మండ‌ల క‌మిటీ స‌మావేశం విజ‌య్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్య‌ద‌ర్శి వి న‌ర‌సింహ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద దాడి ఎక్కి పెట్టిందని.. అందులో భాగంగా దశాబ్దాపాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు అన్నిటిని రద్దు చేసే విధంగా నాలుగు లేబర్ కోడలు తెచ్చిందని అందులో భాగంగా దేశ కార్మిక వర్గానికి రక్షణ కవచంలా ఉన్నటువంటి 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని.. దీంతో రాబోయే రోజుల్లో సంఘం పెట్టుకునే హక్కు కనీస వేతనం అడిగే హక్కు, అలాగే సమ్మె చేసే హక్కు కార్మిక వర్గం కోల్పోతున్నారని తెలిపారు.

కోట్లాదిమంది కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులకు, యజమాన్యానికి బానిసలుగా మార్చే కుట్ర ఈ లేబర్ కోడుల ద్వారా చేస్తుందన్నారు. దీని కార్మిక వర్గం గమనించి సాధించుకున్న చట్టాలతో పాటు ఇంకా కార్మిక వర్గానికి అవసరమైన చట్టాల సాధన కొరకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు . దేశంలో స్కీం వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత అమలు కావడం లేదని, పారిశుద్ధ కార్మికులను పర్మినెంట్ చేసి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవనిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు అయ్యే స్కీమ్‌ లను యధావిధిగా కొనసాగించి అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు పరిమళ పుష్ప, పారిశుద్ధ కార్మికులు సువర్తమ్మ, సవారమ్మ, హమాలి సంఘం నాయకులు గంగన్న, తిమ్మప్ప, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నర్సింహులు పాల్గొన్నారు

Next Story