పోరాటాల ద్వారానే హ‌క్కులు సాధించుకోవాలి : సీఐటీయూ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.శ్రీనివాసులు

by Ratna Kumari |

దిశ‌, అచ్చంపేట : పోరాటాల ద్వారానే హ‌క్కులు సాధించుకోవాల‌ని సీఐటీయూ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.శ్రీనివాస్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా

పోరాటాల ద్వారానే హ‌క్కులు సాధించుకోవాలి : సీఐటీయూ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.శ్రీనివాసులు
X

దిశ‌, అచ్చంపేట : పోరాటాల ద్వారానే హ‌క్కులు సాధించుకోవాల‌ని సీఐటీయూ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.శ్రీనివాస్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మూడో మహాసభలు జిల్లా అధ్యక్షులు భక్తుల వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామాలలో పారిశుద్య పరుస్తూ ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. వారి సమస్య పరిష్కారానికై సమస్యల పై సమరశీల పోరాటాలు ఏకైక మార్గమని మహాసభలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు అన్నారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ.. కర్ణాటక, కేరళ, చండీగఢ్ రాష్ట్రాలలో గ్రామపంచాయతీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి పేస్కేల్ అమలు చేస్తున్నారని పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో 18 వేల జీతం గ్రామపంచాయతీ కార్మికులకు ఇస్తున్నారని తెలిపారు.


తెలంగాణలో గ్రామపంచాయతీ కార్మికులు ఎందుకు ఇవ్వరని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న కార్మికుల వేతనాల కోసం ఈ రాష్ట్రంలో అమలుకై ప్రజా పోరాటాలే మార్గం అన్నారు. కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం మట్టి ఖర్చులకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, చనిపోయిన ఉద్యోగులకు ఒక తీరు కార్మికులకు ఒక తీరు ఇవ్వడం ఏంటిదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ‌ట్టి ఖర్చులకు ఈ ప్రభుత్వం రూ.50 వేలు ఇవ్వాలని, ప్రమాద భీమా సౌకర్యం రూ .10 లక్షల కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదేళ్లు పాలించే వారికే అన్ని హక్కులు ఉంటే జీవితాంతం శ్రమించి వారి శ్రమను ధారబోస్తున్న కార్మికునికి హక్కు ఉండదా అని ప్రశ్నించారు. వారి హక్కుల కోసం ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలను కర్తవ్యాలను రాబోయే కాలంలో పోరాటాలను ఉదృతం చేసి సాధించుకుంటామన్నారు. ఈ మ‌హాస‌భ‌లో గ్రామ‌పంచాయ‌తీ వ‌ర్క‌ర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియ‌న్ జిల్లా, అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు మల్లేష్, సీఐటీయూ జిల్లా కార్య‌ద‌ర్శి ఎం.శంక‌ర్ నాయ‌క్, వ్య‌వ‌సాయ కార్మిక సంఘం జిల్లా నాయ‌కులు మ‌ల్లేష్, నాగ‌రాజు, సైదులు, సీఐటీయూ ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి బి.రాములు, గ్రామ‌పంచాయ‌తీ వ‌ర్క‌ర్స్, జిల్లా నాయ‌కులు బాల‌స్వామి, లింగ‌స్వామి, వెంక‌టేష్, రాము, ప‌రుశురాములు మండ‌ల అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శిలు పాల్గొన్నారు.


Next Story