- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపదలో ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి సీఐ రామ్ లాల్
దిశ, మక్తల్ : విద్యార్థులు ఏదైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ రామ్ లాల్ తెలిపారు. మంగళవారం మాగనూర్ మండలం నేరడిగాం

దిశ, మక్తల్ : విద్యార్థులు ఏదైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ రామ్ లాల్ తెలిపారు. మంగళవారం మాగనూర్ మండలం నేరడిగాం శ్రీసిద్ద లింగేశ్వర విద్యాలయం విద్యార్థులు మక్తల్ పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఐ పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. ప్రజలకు పోలీసులు సేవలందించాలంటే ప్రెండ్లీ పోలిసింగ్ పై ప్రతీ ఒక్కరికీ తెలియాలన్నారు. అలాగే వైర్ లెస్ సెట్ లో మాట్లాడే విధానం, పోలీస్ లాకప్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్, పహారా డ్యూటీలు, సీసీ కెమెరాల పనితీరు, సీసీ కెమెరాల మానిటరింగ్ సిస్టమ్, డయల్ 100 వంటి సేవలు, మహిళల భద్రత చర్యలు, పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులకు రిసెప్షన్ లో రిసీవ్ విధానం, పలు పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా అపరిచితులను చూసినా ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రేవతి, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఉపాద్యాయులు పాల్గొన్నారు.






