యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : సీఐ న‌ర‌సింహ

by Ratna Kumari |

దిశ‌, పాన్ గ‌ల్ : యువ‌త చ‌దువుతో పాటు క్రీడ‌ల్లో రాణించాల‌ని సీఐ కేతూరి న‌ర‌సింహ పేర్కొన్నారు. శుక్ర‌వారం కేతెప‌ల్లి పాఠ‌శాల‌లో ఉమ్మ‌డి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల‌ను హై కోర్టు

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : సీఐ న‌ర‌సింహ
X

దిశ‌, పాన్ గ‌ల్ : యువ‌త చ‌దువుతో పాటు క్రీడ‌ల్లో రాణించాల‌ని సీఐ కేతూరి న‌ర‌సింహ పేర్కొన్నారు. శుక్ర‌వారం కేతెప‌ల్లి పాఠ‌శాల‌లో ఉమ్మ‌డి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల‌ను హై కోర్టు అడ్వ‌కేట్ ర‌వికుమార్ తో కలిసి ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు క్రీడల్లో రాణించలని సూచించారు. ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం ఎంచుకొని.. ఆ లక్ష్యం నేరవేరేందుకు పట్టుదలతో రాణిస్తే తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చని తెలిపారు. వాలీబాల్ పోటీలో గెలుపొందిన విజేతలకు గ్రామానికి చెందిన యువకులు అన్వేష్, రామకృష్ణ లు మొదటి బహుమతిగా రూ.20వేలు ద్వితీయ బహుమతిగా మీనిగా శంకర్ రూ.10వేలు అందజేశారు క్రీడా పోటీల్లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ సంగణమోని అన్వేష్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారు లు గోపి గౌడ్, సత్యనారాయణ గ్రామ‌స్తులు పేర్కొన్నారు.

Next Story