- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాకీ గుండెల వెనక కారుణ్యం
by Ratna Kumari |
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఒక కుటుంబాన్ని మహబూబ్ నగర్ పట్టణం వన్ టౌన్ సీఐ అప్పయ్య ఆదుకొని ఖాకీ గుండెలో వెనక కారుణ్యం కూడా దాగి ఉందని నిరూపించుకున్నాడు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఒక కుటుంబాన్ని మహబూబ్ నగర్ పట్టణం వన్ టౌన్ సీఐ అప్పయ్య ఆదుకొని ఖాకీ గుండెలో వెనక కారుణ్యం కూడా దాగి ఉందని నిరూపించుకున్నాడు. మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ అప్పయ్య సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్ళి ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. అద్దె ఇంట్లో ఉండి, కూలి పనిచేసుకుంటూ భర్త లేని కృష్ణవేణి అనే బీద మహిళ కుటుంబం ప్రమాదంలో సర్వం కోల్పోవడంతో, మానవతా దృక్పథంతో స్పందించిన సీఐ అప్పయ్య కుటుంబానికి కావాల్సిన నెలసరి సరుకులు, బట్టలు, వంట పాత్రలు సొంత డబ్బులతో సమకూర్చి, డిఎస్పీ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించి దాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి, పట్టణ ప్రముఖులు సీఐ అప్పయ్య ను అభినందించారు.
Next Story






