- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
by velandi.Saikiran |
రాఘవ కన్స్ట్రక్షన్ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని కలెక్టర్ కు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

X
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు పెద్దవాగు నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సోమవారం జిల్లా కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిసిన ఆదాయాన్ని కోల్పోయిందని ఆరోపణలు చేశారు. సెలవు దినాల్లో ఉన్నా అక్రమంగా ఇసుక తగిలింపు జరుగుతోందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఇసుక రవాణా విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






