- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలల హక్కులను పరిరక్షించాలి : ఎంపీడీఓ కీర్తన
దిశ, రేవల్లి : బాల, బాలికల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రేవల్లి ఎంపీడీవో కీర్తన అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన

దిశ, రేవల్లి : బాల, బాలికల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రేవల్లి ఎంపీడీవో కీర్తన అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మైనర్ బాల, బాలికలకు బాల్య వివాహలు చేయకూడదని, లేదంటే నిషేధ చట్టం ప్రకారం శిక్షింప బడుతారని తెలిపారు. గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు సమన్వయంతో పని చేసుకుని బాలలకు సంబంధించినటువంటి సమస్యల మీద విస్తృతమైన అవగాహన కల్పించాలని కోరారు. బాల్యవివాహాలు బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలను ముందస్తుగానే గుర్తించడం వల్ల పిల్లలు సమస్యల బారిన పడకుండా కాపాడవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగఅధికారి సురేందర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుజాత, మండల విద్యాధికారి బాలరెడ్డి, ఆర్ఐ శంకర్, రాజు, దేవాలయఅర్చకులు, అంగన్ వాడీ టీచర్లు, ఆశాలు ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.






