- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలల దినోత్సవం.. చిన్నారులతో చిందులు
దిశ, రేవల్లి : సాధారణంగా బాలల దినోత్సవం అంటే జవహర్ లాల్ నెహ్రు జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. ఆయనకు చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి

దిశ, రేవల్లి : సాధారణంగా బాలల దినోత్సవం అంటే జవహర్ లాల్ నెహ్రు జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. ఆయనకు చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆయనకు ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తూ బాలల దినోత్సవంగా నవంబర్ 14ను జరుపుకుంటారు. పిల్లలపై ప్రేమ, సంరక్షణ, అభివృద్ధిని గుర్తుచేస్తూ హక్కుల దుర్వినియోగం, బాలలవెట్టిచాకిరి నుంచి రక్షణ, వారికి విద్యను అందించేందుకు ఈరోజు బలపరుస్తుందని చెప్పవచ్చు. విద్యాలయాలలో బాలబాలికలతో అవగాహనకై వ్యాసరచన, ఆటల పోటీలు, ఉపన్యాస, స్వయంపాలనను అందిస్తూ బాలబాలికలచే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా రేవల్లిలోని ప్రగతి విద్యాలయం నిర్వహకులు డీజే పాటలకు చిన్నారులతో చిందులేయించి పలువురిని ఆశ్చర్యానికి గురిచేశారు.
రేవల్లి మారుమూల ప్రాంతం కావడం.. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో అధికారులు, పాలకుల పర్యవేక్షణ కరువవ్వడంతో ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. రేవల్లిలోని ప్రగతి విద్యాలయం నిర్వహకులు చిన్నారులతో చిందులకు పూనుకొన్నట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. డీజే సౌండ్ వల్ల వినికిడి, తలనొప్పి, ఒత్తిడి, హృదయ స్పందన రేటు పెరగడం, నిద్రభంగం, మానసిక అసౌకర్యం విన్నపెద్దలకు అనారోగ్యసమస్యలు ఉత్పన్నం అవుతాయి. చిన్నారులకు అత్యంత ప్రమాదకరం అనే చెప్పవచ్చు. శరీరం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ డిసెబుల్ పరిమితికి మించి అత్యధిక శబ్దంవల్ల వారికి ప్రమాదమని ప్రభుత్వం డీజే సౌండ్ నిషేధిస్తూ పరిమితులు విధించింది. ఇక్కడి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం బాల బాలికల భద్రతను పక్కన పెట్టేసి నిబంధనలతో తుంగలో తొక్కుతూ చిన్నారులతో చిందులు వేయించడం పాశవికచర్య అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై ఎస్సై రజితను దిశ ప్రతినిధి వివరణ కోరగా.. పాఠశాలను సందర్శించి పరిశీలిస్తామని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాల్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. చిన్నారులతో నృత్యాల విషయమై వారిని సంప్రదించి వివరాలు అందిస్తానని తెలిపారు.






