పండగ సెలవుల్లో పిల్లలు జాగ్రత్త

by Elthuri vijay kumar |

పండుగ సెలవులు వచ్చాయంటే పిల్లలు అల్లరిగా గడపడానికే ఎక్కువగా ఇష్టపడతారని, అటువంటి సమయాల్లోనే తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో సూచించారు.

పండగ సెలవుల్లో పిల్లలు జాగ్రత్త
X

పండగ సెలవుల్లో పిల్లలు జాగ్రత్త

- పిల్లల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి

- జిల్లా ఎస్పీ జానకి

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: పండుగ సెలవులు వచ్చాయంటే పిల్లలు అల్లరిగా గడపడానికే ఎక్కువగా ఇష్టపడతారని, అటువంటి సమయాల్లోనే తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో సూచించారు. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు పాటించాల్సిన పలు సూచనలు చేస్తూ, బైక్, కార్ల తాళాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదని, వారి సరదాకు వాహనాలు నడపనివ్వకూడదని, పర్యవేక్షణ లేకుండా పిల్లలను దూర ప్రాంతాలు, పిక్నిక్, టూర్లు లాంటి వాటికి పంపరాదని ఎస్పీ తెలిపారు. పిల్లలు మోబైల్స్ వాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఏం షేర్ చేస్తున్నారో క్షుణ్ణంగా గమనించాలని, వారు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఓ కంట కనిపెడుతూనే ఉండాలని ఆమె సూచించారు. సెలవు దినాల్లో ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇవ్వాలని, మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలపై అవగాహన కల్పించాలని, 'నివారణ ఎల్లప్పుడూ, చికిత్స కన్నా మంచిది' అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని ఎస్పీ జానకి తల్లిదండ్రులకు సూచించారు.

Next Story