బాల్యవివాహాలు చేస్తే శిక్షార్హులు

by Ratna Kumari |

మండల పరిధిలోని పాతర్చేడ్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఓఎంఐఎఫ్ఆ పరేషన్ మెర్సి ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు సామాజిక అంశాల పై మహిళలకు అవగాహన సదస్సు పాతార్చేడ్ గ్రామంలో ఏర్పాటు చేశారు.

బాల్యవివాహాలు చేస్తే శిక్షార్హులు
X

దిశ‌, న‌ర్వ : మండల పరిధిలోని పాతర్చేడ్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఓఎంఐఎఫ్ఆ పరేషన్ మెర్సి ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు సామాజిక అంశాల పై మహిళలకు అవగాహన సదస్సు పాతార్చేడ్ గ్రామంలో ఏర్పాటు చేశారు. జిల్లా కోఆర్డినేటర్ హాజమ్మ మాట్లాడుతూ మన జిల్లాలో 350 గ్రామాలలో మా సంస్థ పని చేస్తుందన్నారు. మూఢ నమ్మకాలు జోగిని వ్యవస్థ బాల్యవివాహాలు మీద పని చేస్తున్నామని మహిళలకు తెలిపారు. టెన్త్ పాస్ అయిన విద్యార్థులు ఉంటే వారికి టైలరింగ్ కంప్యూటర్ బ్యూటిషన్ మీద ట్రైనింగ్ ఇస్తామని తెలియజేశారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నర్వ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సరైన‌ పోషకాహారం లేక పోతే రక్తహీనతతో బాధపడతారని బీపీ, షుగర్ థైరాయిడ్ వ్యాధులతో మహిళలందరూ ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలని సరైన ఆహారం తింటూ ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. నర్వ హెడ్ కానిస్టేబుల్ నరసింహులు మాట్లాడుతూ మహిళలను జోగినీలుగా చేయరాదని చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయరాదని అలా చేసిన వారు శిక్షార్హులు అని తెలియజేశారు. ప్రతి ఇంటిలో సెల్ ఫోను టీవీ ఏవిధంగా ఉంటుందో అలాగే మరుగు దొడ్డి కట్టించుకోవాలని తెలిపారు. మహిళలు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ శ్రీకాంత్, మన్యం. కానిస్టేబుల్ సారిక, సురేష్, ఓఎంఐఎఫ్ సంస్థ హెల్త్ వ‌ర్క‌ర్స్ వై. లక్ష్మి, కళావతి, జయమ్మ, నిర్మల, వెంకటేశ్వరమ్మ, ప్రమీల, అంజమ్మ, నిర్మల, అశ్విని పాల్గొన్నారు.

Next Story