బాల్య వివాహాల వలన అనేక దుష్పరిణామాలు : డీఎల్ఎస్ఏ కార్య‌ద‌ర్శి, జ‌డ్జీ ఇందిర

by Nallavelli.Anjaneyulu |

బాల్య వివాహాల వలన అమ్మాయిల విద్య కు ఆటంకం, చిన్న వయసులోనే గర్భం ధరించడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, గృహ హింస లాంటి అను దుష్పరిణామాలు కలుగుతాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు.

బాల్య వివాహాల వలన అనేక దుష్పరిణామాలు : డీఎల్ఎస్ఏ కార్య‌ద‌ర్శి, జ‌డ్జీ ఇందిర
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బాల్య వివాహాల వలన అమ్మాయిల విద్య కు ఆటంకం, చిన్న వయసులోనే గర్భం ధరించడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, గృహ హింస లాంటి అను దుష్పరిణామాలు కలుగుతాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని 'టచ్ హోం, సన్నిధి చిల్డ్రన్ హోం' లను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మమతా రెడ్డి తో కలిసి ఆమె సందర్శించారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని, వివాహం, చేసుకున్నవారు, చేసినవారు, హాజరయిన వారు కూడా దోషులని ఆమె హెచ్చరించారు. అలాగే పొక్సో చట్టం గురించి వివరిస్తూ, 18 సంవత్సరాల లోపు అమ్మాయిల లైంగిక వేదింపులు, లైంగిక నేరాలు, మానసికంగా వేధించడం కూడా తీర్ర నేరంగా పరిగణించి కఠినమైన శిక్షలు విధించే ఒక ప్రత్యేకమైన చట్టం పొక్సో చట్టమని, ఈ చట్టం ద్వారా పిల్లలకు లభించే రక్షణల గురించి, లీగల్ సర్వీసెస్ యాక్ట్, వాటి ప్రయోజనాల గురించి జడ్జి వివరించారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ హోం నిర్వాహకులు, జగపతిరావు, రామచంద్రయ్య గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story