చెన్నై షాపింగ్ మాల్‌లో సందడి చేసిన సినీ నటి కృతి శెట్టి (Krithi Shetty)

by Vinod kumar |   (  Updated:2022-09-12 11:00:43  IST  )

వస్త్ర ప్రపంచంలో సరికొత్త సంచలనం కలిగిస్తూ.. కొనుగోలుదారుల - Chennai shopping mall 16th branch launched by actress Krithi Shetty in Mahabubnagar district

చెన్నై షాపింగ్ మాల్‌లో సందడి చేసిన సినీ నటి కృతి శెట్టి (Krithi Shetty)
X

దిశ, మహబూబ్ నగర్: వస్త్ర ప్రపంచంలో సరికొత్త సంచలనం కలిగిస్తూ.. కొనుగోలుదారుల నమ్మకాన్ని చూరగొంటూ వస్తున్న చెన్నై షాపింగ్ మాల్ తమ 16వ బ్రాంచ్‌ను సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ సినీనటి కృతి శెట్టి చెన్నై షాపింగ్ మాల్‌కు చేరుకొని హల్ చల్ చేశారు.


తమ అభిమాన తారలు వస్తున్నారు అన్న సమాచారంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రత్యేకించి యువత తల్లి రావడంతో.. తోపులాటలు జరిగాయి.. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన కృతి శెట్టి కి మర్రి జమున, తదితరులు స్వాగతం పలికారు. కృతి శెట్టి చెన్నై మాల్‌లోని వస్త్రాలను, ఆభరణాలను ప్రత్యేకంగా తిలకించారు.



Next Story