ఎంఎస్పీ జిల్లా అధికార ప్ర‌తినిధిగా చెల్లెపాటి రాజ‌మౌళి మాదిగ‌

by Ratna Kumari |   (  Updated:2025-09-30 10:25:07  IST  )

దిశ‌, పెద్ద కొత్త‌ప‌ల్లి : మండ‌ల ప‌రిధిలోని చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు చెల్లెపాటి రాజమౌళి మాదిగను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత

ఎంఎస్పీ జిల్లా అధికార ప్ర‌తినిధిగా చెల్లెపాటి రాజ‌మౌళి మాదిగ‌
X

దిశ‌, పెద్ద కొత్త‌ప‌ల్లి : మండ‌ల ప‌రిధిలోని చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు చెల్లెపాటి రాజమౌళి మాదిగను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా మంగళవారం ఎంపికయ్యారు. త‌న‌పై ఉంచిన నమ్మకాన్ని వ‌మ్ము చేయ‌కుండా.. పార్టీ ఆదేశాల మేరకు త‌న వంతు కర్తవ్యం గా పనిచేస్తానని రాజ‌మౌళి తెలిపారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించిన మందకృష్ణ మాదిగ కు, తనకు సహకరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story