- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరగుట్ట పై చిరుత సంచారం
మహబూబ్‌నగర్ మండలం రామచంద్రాపూర్ గ్రామ సమీపంలోని పటేల్ కుంట వద్ద ఉన్న చువ్వ గుట్టపై చిరుత సంచారం కనిపించడం గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్‌నగర్ మండలం రామచంద్రాపూర్ గ్రామ సమీపంలోని పటేల్ కుంట వద్ద ఉన్న చువ్వ గుట్టపై చిరుత సంచారం కనిపించడం గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపినా వారు స్పందించడంలేదని గ్రామ సర్పంచ్ వై. నర్సింహులు ఆరోపించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా, ఫారెస్ట్ బీట్ అధికారులు స్పందిస్తూ, చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించామని, అది అటవీ ప్రాంతానికి చెందిందని, ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించారు. గ్రామస్తులు మాత్రం గుట్ట ప్రాంతానికి వెళ్లడాన్ని తగ్గిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరుత సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు మరింత చురుకుగా స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.






