- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్ర నీళ్లతో వాటికి చెక్.. వింత ఆలోచన చేసిన జల్లాపురం రైతులు...!
దిశ, మానవపాడు : వీధి శునకాల బెడదకు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం రైతులు చిన్న టెక్నిక్‌తో చెక్ పెట్టారు. ఎర్ర నీళ్లను బాటిళ్లలో నింపి వీధి శునకాలు,

దిశ, మానవపాడు : వీధి శునకాల బెడదకు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం రైతులు చిన్న టెక్నిక్‌తో చెక్ పెట్టారు. ఎర్ర నీళ్లను బాటిళ్లలో నింపి వీధి శునకాలు, ఇతర జంతువులు సమస్య నుంచి బయటపడ్డారు. దీనికి శాస్త్రీయ ఆధారాలేవీ లేనప్పటికీ వారి సమస్యకు మాత్రం పరిష్కారం దక్కినట్లు కనిపించింది. పంటపొలాలను కుక్కలు ఇతర జంతువులు పాడు చేస్తున్నాయని చాలా మంది భయపడుతుంటారు. వీటి నుంచి విముక్తి కల్పించుకోవడానికి వినూత్న వింత ఆచారం నిర్వహించారు. ఖాళీ వాటర్ బాటిళ్లలో ఎర్రని రంగును నీటిలో కలిపి మిరప నారా పంట చుట్టూ వేలాడదీశాడు. దీంతో అటువైపు కుక్కలు కానీ ఇతర జంతువులు కానీ రావడంలేదని జల్లాపురం గ్రామానికి చెందిన రైతు మహబూబ్ తెలిపాడు. హైదరాబాద్ పట్టణంలో ఓ ఇంటి ముందు ఈ విధంగా ఎర్రని బాటిళ్లు కట్టడంతో కుక్కలు కానీ ఇతర జంతువులు కానీ ఇంటిముందు రావని చెప్పడంతో నేను కూడా అలా చేశానని 'దిశ న్యూస్' తో పేర్కొన్నాడు.






