అడ‌వుల దురాక్ర‌మ‌ణ‌కు అడ్డుగా చెక్ పోస్ట్

by Ratna Kumari |

దిశ‌, కొల్లాపూర్ : న‌ల్ల‌మ‌ల్ల అడ‌వులు క‌బ్జాకు గురికాకుండా క‌ట్ట‌డి చేసేందుకు ఒట్టిమాకుల కుంట‌కు వెళ్లే దారిలో అట‌వీశాఖ ఆధ్వ‌ర్యంలో గురువారం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా అడవులకు

అడ‌వుల దురాక్ర‌మ‌ణ‌కు అడ్డుగా చెక్ పోస్ట్
X

దిశ‌, కొల్లాపూర్ : న‌ల్ల‌మ‌ల్ల అడ‌వులు క‌బ్జాకు గురికాకుండా క‌ట్ట‌డి చేసేందుకు ఒట్టిమాకుల కుంట‌కు వెళ్లే దారిలో అట‌వీశాఖ ఆధ్వ‌ర్యంలో గురువారం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా అడవులకు కబ్జా దారులు వెళ్లే మార్గాన్ని మూసివేసినట్లు అచ్చంపేట డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్ర శేఖర్ వెల్లడించారు. గురువారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెక్షన్ ఆఫీసర్ ముజీబ్ ఘోరీ తో కలిసి ఆయన మాట్లాడారు. గతం లో 2011 నుంచి 2014 వరకు నల్లమల అడవులను నరికివేతకు గురిచేస్తూ అక్రమ సాగుకు పాల్పడుతూ వచ్చారని ఎఫ్డీఓ చంద్ర శేఖర్ తెలిపారు. అందులో భాగంగానే నార్లాపూర్, ముక్కిడి గుండం, గెమ్యా నాయక్, జీల్ద్ దార్ తిప్ప, ఒట్టిమాకుల కుంట ప్రాంతాల్లో విపరీతంగా అడవి దురాక్రమణ కు గురైయిందన్నారు. తాను ఫారెస్ట్ రెంజర్ గా ఇక్కడికి వచ్చాక కొంత వరకు నియంత్రించినట్లు ఆయన వివరించారు. గత రెండు రోజులుగా నల్లమల లో చోటు చేసుకున్న పరిణామాల పై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒట్టి మాకులకుంట ప్రాంతంలో కొందరు అడవిని నరికి చెట్లను అడ్డుపడిన సెక్షన్ ఆఫీసర్ జయరాజ్, బీట్ ఆఫీసర్ హెమ్లా నాయక్ పై భూ ఆక్రమణదారులు దాడికి పాల్పడిన సంఘటన తో బుధవారం, గురువారాల్లో 2వేల మొక్కలు నాటినట్లు ఆయన చెప్పారు. అడవుల ను మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, ఈ విషయాన్ని సమాజం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story