పేదలకు అండగా.. రైతు భీమా

by Nallavelli.Anjaneyulu |

దిశ, పెద్ద కొత్త పల్లి : మండలంలోని చంద్రబండ తండాకు చెందిన మాజీ వార్డు మెంబర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రైతు కేతావత్ శంకర్ నాయక్ గత నెలలో ఆర్టీసీ

పేదలకు అండగా.. రైతు భీమా
X

దిశ, పెద్ద కొత్త పల్లి : మండలంలోని చంద్రబండ తండాకు చెందిన మాజీ వార్డు మెంబర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రైతు కేతావత్ శంకర్ నాయక్ గత నెలలో ఆర్టీసీ బస్సును డీ కొట్టింది. దీంతో అత‌ను ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతి చెందాడు. మృతుడికి రైతు బీమా పథకంలో ఇన్సూరెన్స్ ఉన్నందున రైతు కేతావత్ శంకర్ నాయక్ బీమా కోసం కుటుంబికులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడు, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ సహకారంతో మృతుడి సతీమణి కేతావత్ చిట్టి కి రూ.5 లక్షల చెక్కు మంజూరు అయింది. ఈ చెక్కును శుక్రవారం మారేడుమాన్ దిన్నె ఉమ్మడి గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ పాత్లావత్ బాలు నాయక్ అంద‌జేశారు. తమటం వెంకటస్వామి గౌడు, నాయకులు కేతావత్ లోక్యా నాయక్, కేతావత్ శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story