సోమ‌శీల ఆల‌యంలో మారు మ్రోగిన శివ‌నామ‌స్మ‌ర‌ణ‌లు

by Ratna Kumari |

మహా శివరాత్రి సందర్భంగా నాగర్ కర్నూల్ కొల్లాపూర్ మండలం సోమశిల లోనీ ఆలయ సముదాయం భక్తుల తో కిటకిట లాడింది.

సోమ‌శీల ఆల‌యంలో మారు మ్రోగిన శివ‌నామ‌స్మ‌ర‌ణ‌లు
X

దిశ, కొల్లాపూర్ : మహా శివరాత్రి సందర్భంగా నాగర్ కర్నూల్ కొల్లాపూర్ మండలం సోమశిల లోనీ ఆలయ సముదాయం భక్తుల తో కిటకిట లాడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులతో లలితాంబికా సోమేశ్వర స్వామి ఆలయ సముదాయం శివ నామస్మరణలతో మారుమ్రోగింది. హ‌రి హర మహదేవ.. శంభోశంకర అంటూ భక్తులు స్మరించుకున్నారు. సోమశీలకు తూర్పున రెండు కొండల మధ్య నుంచి గలగలారూతూ పొంగి ప్రవహిస్తున్న కృష్ణానది సప్త నదుల సంగమ ప్రదేశంలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు.మహిళ భక్తులు తలంటి స్నానాలు చేసి నదిలో గంగమ్మ కు నియమ నిష్ఠలతో పూజలు చేసి ప్రదిమలను నదిలో వదిలారు. చుట్టూ కొండలు.. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం క్షేత్రాన్నీ భక్తులు లలితాంబికా సోమేశ్వర స్వామి వారినీ దర్శించుకున్నారు. ఆలయం లో దంపతులు కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు, ద్వాదశ జ్యోతిర్లింగములను భక్తులు దర్శించుకున్నారు. కొల్లాపూర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ దంపతులు స్వామి వారినీ దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సీఐ మహేష్ దంపతులను శాలువాకప్పి సన్మానం చేశారు. భక్తులకు సోమశిల ఆలయం, కొల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆలయం ఆవరణలో అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా ఆలయ కమిటీ చైర్మన్ బుక్క గోవింద రెడ్డి పర్యవేక్షించారు. కొల్లాపూర్ పట్టణం నుంచి సోమశిల పుణ్య క్షేత్రానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపారు. ఇవాళ రాత్రికి తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఆలయం ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటలకు వరకు ఈ వేదిక పై 120 మంది కళాకారులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఉపవాసంతో జాగరణం చేసే భక్తులను అలంకరింపంచేయనున్నారు. కొల్లాపూర్ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు పహారా చేశారు.

Next Story