సబ్‌ రిజిస్ట్రార్ పనివేళలలో మార్పు.. రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్య పెంపు

by Ratna Kumari |

రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉండ‌టంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ప‌ని వేళ‌లు పొడ‌గించారు.

సబ్‌ రిజిస్ట్రార్ పనివేళలలో మార్పు.. రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్య పెంపు
X

దిశ, క్రైమ్ / వనపర్తి : మార్కెట్ విలువల సవరణ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉండ‌టంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యను పెంచడంతో పాటు కార్యాలయ పని వేళలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పొడిగించినట్లు వనపర్తి సబ్‌ రిజిస్ట్రార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం.. తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Next Story