- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోస్గిలో చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు ఏకగ్రీవం
by Bhoopathi Nagaiah |
కోస్గి మున్సిపాలిటీ పాలకవర్గాన్ని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఇతర పార్టీల పోటీలేకపోవడంతో ఎన్నిక సులువగా జరిగింది.

X
దిశ, కోస్గి : కోస్గి మున్సిపాలిటీ పాలకవర్గం కొలువుదీరింది. ఎన్నికల అనంతరం సోమవారం ఎన్నికల ప్రత్యేక అధికారి మొగులప్ప ఓటింగ్ నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నిక నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నాగరాజ్ ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 8వ వార్డు కౌన్సిలర్ నాగులపల్లి నరేందర్‌ను కోస్గి మున్సిపల్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా 2వ వార్డు సభ్యురాలు చింతల సరితను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోస్గి మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఎక్కడ ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికైన సభ్యులను ఎన్నికల ప్రత్యేక అధికారి మొగులప్ప, మున్సిపల్ కమిషనర్ నాగరాజ్ లతో పాటు మున్సిపల్ సిబంది అభినందించారు.
Next Story






