కేంద్ర‌ప్ర‌భుత్వం రైతుల‌కు న‌ష్టం క‌లిగించే విధానాలు అవ‌లంభిస్తోంది : సీపీఎం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నారాయ‌ణ‌పేట జిల్లా ప్ర‌తినిధి : కేంద్ర ప్ర‌భుత్వం కార్మికుల‌కు, రైతుల‌కు, కూలీల‌కు న‌ష్టం క‌లిగించే విధానాలు అవ‌లంభిస్తోంద‌ని

కేంద్ర‌ప్ర‌భుత్వం  రైతుల‌కు న‌ష్టం క‌లిగించే విధానాలు అవ‌లంభిస్తోంది : సీపీఎం
X

దిశ‌, నారాయ‌ణ‌పేట జిల్లా ప్ర‌తినిధి : కేంద్ర ప్ర‌భుత్వం కార్మికుల‌కు, రైతుల‌కు, కూలీల‌కు న‌ష్టం క‌లిగించే విధానాలు అవ‌లంభిస్తోంద‌ని సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి జి. వెంక‌ట్రామిరెడ్డి విమ‌ర్శించారు. శుక్ర‌వారం నారాయ‌ణ‌పేట జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చ‌, కార్మిక సంఘాల ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ చౌక్ లో న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వెంక‌ట్రామిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి అంజిల‌య్య గౌడ్, ప్ర‌గ‌తిశీల వ్య‌వ‌సాయ కార్మిక సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి ప్ర‌శాంత్ ప్ర‌సంగించారు. కార్పొరేట్ యాజ‌మాన్యాల ప్ర‌యోజ‌నాల కోసం సంప‌ద సృష్టి క‌ర్త‌లైన కార్మిక వ‌ర్గాన్ని ఆధునిక బానిస‌లుగా మార్చే కుట్ర‌లో భాగంగానే నాలుగు లేబ‌ర్ కోడ్ అమ‌లు కోసం న‌వంబ‌ర్ 21న కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశార‌ని విమ‌ర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విబీజీ రామ్ జీ పేరుతో మార్పు చేశారని కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు కేటాయిస్తే.. ప్రస్తుతం 60 శాతానికి పరిమితం చేసి మిగతా 40 శాతాన్ని రాష్ట్రాలపై రుద్దుతూ ఉపాధి పథకాన్ని క్రమంగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే బీజేపీ ఈ నాటకమాడుతుందని విమర్శించారు.


CITU జిల్లా కార్యదర్శి బండమీది బాల్ రామ్ , ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హాజీ మలాంగ్ మాట్లాడుతూ భీమా రంగంలో 100% ఎఫ్డిఐ లకు వెసులుబాటు కల్పిస్తూ సబ్కా భీమా సబీ రక్ష అనే పేరుతో భీమా చట్టాల బిల్లు తీసుకొచ్చిందని అన్నారు. ఇది ఉద్యోగులకు,పాలసీదారులకు అత్యంత ప్రమాదకరమైనదని కేవలం బీమా కంపెనీల పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేటివని దేశ ప్రజలకి తీవ్ర నష్టదాయకమని తెలియజేశారు. న‌రేంద్ర మోడీ బీజేపీ ప్ర‌భుత్వ విధానాలు కార్మికులు, రైతులు, ఉద్యోగులు పేద ప్రజలపై ఏకకాలంలో దాడి చేస్తున్నదని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమం నిర్మించడం కోసం ప్రజా సంఘాలు సమయతమవుతున్నాయని అన్నారు. కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ విధానాల పై పోరాటం చేయాలన్నారు. ఈ నిరసనలో సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా నాయకులు గుండెగారి వెంకట్రాములు, అంజి, సీపీఎం జిల్లా నాయకులు కె కాశప్ప, నరహరి, పవన్ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా నాయకులు బాల్ రాజ్ పాల్గొన్నారు

Next Story