- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. దేశంలో ప్రతిపక్షాలపైకి సీబీఐ, ఈడీ లను ఉసికొల్పుతూ, భయబ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి బీజేపీ జిల్లా కార్యాలయం ముందు ధర్నా చేపట్టేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్, సోనియాగాంధీ లపై తప్పుడు కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పై బీజెపీ అవలంబిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు. బీజేపీ తన తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు ఆనంద్ కుమార్, వినోద్ కుమార్, మిథున్ రెడ్డి, సీజె బెనహర్ పాల్గొన్నారు.






