శాంతియుతంగా రంజాన్ పండుగ జరుపుకోండి

by Naveena |

ముప్పై రోజుల రంజాన్ దీక్షలు ముగిశాయని,పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు.

శాంతియుతంగా రంజాన్ పండుగ జరుపుకోండి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ముప్పై రోజుల రంజాన్ దీక్షలు ముగిశాయని,పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పండుగ సందర్భంగా ఈద్గా,మసీదుల వద్ద, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన అదనపు బందోబస్తును పరిశీలించారు.

రంజాన్ వేళలో ప్రజలు పోలీసులకు సహకరించి,నియమాలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా,సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు రాములు, సురేష్ కుమార్, డిఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,సీఐ వెంకటేష్,టూ టవున్ సీఐ ఇజాజొద్ధీన్,తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story