- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు
మహిళను బెదిరించి ఆమె దగ్గర ఉన్న బంగారు, నగదును దొంగిలించిన ఇద్దరు దొంగలను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లుగా మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

దిశ, భూత్పూరు : మహిళను బెదిరించి ఆమె దగ్గర ఉన్న బంగారు, నగదును దొంగిలించిన ఇద్దరు దొంగలను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లుగా మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గురువారం భూత్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రామకృష్ణతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడారు. భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన పిచ్చకుంట్ల రాములమ్మ కూరగాయల వ్యాపారం చేస్తుంది. ఇందులో భాగంగా ఆమె ఈ నెల మూడో తేదీన తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో మహబూబ్ నగర్ లో కూరగాయలు తీసుకురావడానికి భూత్పూర్ చౌరస్తాకు వచ్చింది. ఈ సమయంలో ఆటో మహబూబ్ నగర్ వెళ్తుందని రాములమ్మను ఆటోలో ఎక్కించుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
అమిస్తాపూర్ సాక్షి గణపతి ఆలయం దాటిన తర్వాత ఆటోను టేకు చెట్ల సమీపంలో మహిళ మెడపై ఓ వ్యక్తి కత్తి పెట్టి బెదిరించగా.. డ్రైవర్ ఆటోను నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి ఆ మహిళ దగ్గర ఉన్న బంగారు పూస్తే, 12 బంగారు చిన్న గుండ్లు, రెండు పెద్ద గుండ్లు, చెవి కమ్మలు, 5000 రూపాయల నగదు మొత్తము దాదాపుగా 75 వేల రూపాయల విలువైన వస్తువులను దొంగలించి ఆ మహిళను వదిలేసి దొంగలు అదే ఆటోలో పరారు అయినట్లుగా డీఎస్పీ వివరించారు. రాములమ్మ కుమారుడు పిచ్చకుంట్ల బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూత్పూర్ సిఐ రామకృష్ణ పర్యవేక్షణలో ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది వెంకట నాయక్, రాఘవేందర్, నాగరాజు, ఎండి ఇబ్రహీం కలిసి దొంగల ఆచూకీ కోసం చర్యలు ప్రారంభించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. ఆటోకు నెంబర్ ప్లేటు తొలగించి మహిళను ఎక్కించుకుపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కావడం జరిగిందని ఆయన తెలిపారు.
ఆటో పై ఉన్న గుర్తులు తదితరాలతో దొంగల ఆచూకీ కోసం గాలించగా.. జడ్చర్లలో దొంగలు పట్టు పడ్డారు అని ఆయన తెలిపారు. ఈ దొంగలలో ఒకడు తిమ్మాజీపేట మండలం బుద్ధ సముద్రం గ్రామానికి చెందిన మనే మోని శివుడు, జడ్చర్ల పట్టణానికి చెందిన చికెన్ షాప్ లో పనిచేసే మహమ్మద్ అక్రమ్ గా గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. వీరి నుంచి ఆభరణాలు, నగదు , బెదిరించడానికి ఉపయోగించిన కత్తి, ఆటో ను స్వాధీన పరుచుకుని నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని డీఎస్పీ వివరించారు. ఈ కేసును రెండు రోజులలో చేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సై చంద్రశేఖర్, సిబ్బందికి డీఎస్పీ నగదు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్సై వేణు పాల్గొన్నారు.






