పెద్ద పులి ఆచూకీ కోసం అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు

by Ratna Kumari |

దిశ, కొల్లాపూర్/పెంట్లవెల్లి : గత మూడు రోజులుగా నల్లమల- కృష్ణానది అటవీ తీర సరిహద్దు గ్రామాల శివారు పంట పొలాల్లో పెద్ద పులి సం

పెద్ద పులి ఆచూకీ కోసం అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు
X

దిశ, కొల్లాపూర్/పెంట్లవెల్లి : గత మూడు రోజులుగా నల్లమల- కృష్ణానది అటవీ తీర సరిహద్దు గ్రామాల శివారు పంట పొలాల్లో పెద్ద పులి సంచరించడంతో ప్రజలు ప్రాణ భయంతో బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి పూట పంటల కాపలకు వెళ్లాలంటేనే రైతులు హడలిపోతున్నారు. బుధవారం రాత్రి పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా పంట పొలాల్లో పెద్ద పులి సంచరించినట్లు గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న కొల్లాపూర్ అటవీ శాఖ అధికారులు గురువారమే రంగంలోకి దిగి పులి పాద ముద్రలను గుర్తించి నిర్దారించారు. దీంతో కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల నల్లమల అటవీ సరిహద్దు కృష్ణా నది తీర గ్రామాలైన మల్లేశ్వరం, ఎంగంపల్లి తండా, సోమశిల, అమరగిరిలో పెద్దపులి పట్ల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మైక్ ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పెద్ద పులి సంచరించే ప్రదేశాల్లో కదలికలను గుర్తించేందుకోసం నల్లమల అటవీ సరి హద్దు అడవిలో సీ సీ కెమెరాలను అధికారులు శనివారం ఏర్పాటు చేశారు. రాత్రి పూట పంట పొలాలకు వెళ్లే రైతులు గుంపులు గుంపులుగా వెళ్లాలని, ఎక్కడైనా పులి ఆచూకీ తెలిస్తే.. వెంటనే తమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానిక అటవీ శాఖ అధికారులు ఇవాళ మూడో రోజు కూడా ప్రజల కు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ ఫారెస్ట్ రెంజర్ ముజీబ్ ఘోరీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భయన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story