సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పొదిల రామయ్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, కందనూల్ : పత్తి రైతులకు శాపంగా మారిన సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పొదిల రామయ్య డిమాండ్

సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలి  :  సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పొదిల రామయ్య
X

దిశ, కందనూల్ : పత్తి రైతులకు శాపంగా మారిన సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పొదిల రామయ్య డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొదిల రామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కిసాన్ యాప్ ద్వారా ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలని కొత్త నిబంధన తేవడంతో రైతులు పత్తి అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలని కొత్త నిబంధన తేవడంతో నిరక్షరాస్యులుగా ఉన్న పత్తి రైతులు స్మార్ట్ ఫోన్ లేక దాన్ని వాడటం రాక కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఏ విధంగా పత్తి అమ్ముకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారన్నారు. ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామంటే మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో కురిసిన అధిక వర్షాలకు పంటలు పూర్తిగా నష్టపోయి నల్లబడ్డ పత్తిని అమ్ముకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన యాప్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని చెప్పడం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా విమర్శించారు. అధిక వర్షాలకు పూర్తిగా పాడైపోయిన పంటలకు ఎకరానికి 40 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజు వర్షాలు కురవడం వల్ల పత్తి తడుస్తుందని తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మధు, సిపిఎం నాయకులు కేతేపల్లి సత్యనారాయణ, మల్లికార్జున్, కురుమయ్య, కార్యకర్తలు సుధాకర్, లక్ష్మయ్య, ఆంజనేయులు, బంగారయ్య, మురళి, వీరేంద్ర, వెంకటస్వామి, పాష, ఖాజా పాల్గొన్నారు.

Next Story