- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు.. స్కూటీ ఢీ
by Bhanu |
మిడ్జిల్ మండల కేంద్రంలో కారు-స్కూటీ ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది.

X
దిశ, మిడ్జిల్ : మిడ్జిల్ మండల కేంద్రంలో కారు-స్కూటీ ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. జడ్చర్ల మండలం గంగాపూర్‌కు చెందిన యాదమ్మ, బాలస్వామి గౌడ్ దంపతులు బోయినపల్లి గ్రామంలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అదే సమయంలో స్కూటీపై కల్వకుర్తి వైపు వెళుతున్న చంద్రధన గ్రామానికి చెందిన రహమాన్, ఇసాక్ లపై ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ముగ్గురికి గాయాలయ్యగా, రహమాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఎస్సై శివ నాగేశ్వరరావు తెలిపారు.
Next Story






