స‌ర్వే పూర్తి చేసినా డ‌బ్బులివ్వలే.. ఎన్నిక‌ల డ్యూటీ చేస్తే ఇస్తారా..?

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మానోపాడు : సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఇస్తామన్న గౌరవ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని

స‌ర్వే పూర్తి చేసినా డ‌బ్బులివ్వలే.. ఎన్నిక‌ల డ్యూటీ చేస్తే ఇస్తారా..?
X

దిశ‌, మానోపాడు : సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఇస్తామన్న గౌరవ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మానవపాడులో ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తమ సమస్యలు చెప్పుకొని ఎంపీడీవో రాఘవకు వినతి పత్రం అందించారు. సమగ్ర సర్వే పూర్తి అయిన వెంటనే డబ్బులు ఇస్తామన్నారు. నేటి వరకు జిల్లాలో ఎక్కడ డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. ఇప్పుడు ఎన్నికల డ్యూటీ నిర్వహించిన ఆ డబ్బులు కూడా ఇస్తారా ఇవ్వరా అని కూడా మరి కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ఇప్పటివరకు సమగ్ర సర్వేలో పని చేసిన ఒక్కొక్క ఉద్యోగికి రూ.10 వేలు రావాల్సి ఉందని.. ఆపరేటర్లకు 5000 నుండి 8000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయులు వాపోయారు. ఉమ్మడి మహబూబ్ న‌గ‌ర్ జిల్లాలో గద్వాల జిల్లాలో సమగ్ర సర్వే చేసిన ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి పారితోషకం గాని జీతం గాని ఇవ్వలేదని వాపోయారు. అధికారులు స్పందించకపోతే క‌లెక్ట‌ర్ కి లేదా రాష్ట్ర అధికారులకు వినతిపత్రం అందిస్తామని జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ శివప్రసాద్ తెలిపారు.

Next Story