మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

by Naveena |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు యాజమాన్య హక్కులను కల్పించింది.

మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు యాజమాన్య హక్కులను కల్పించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 77మండలాలు ఉండగా.. మొదటి విడతగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు 45 బస్సులను కేటాయించారు. ఒక్కొక్క బస్సు రూ.33లక్షల విలువైనదిగా అధికారులు ప్రకటించారు. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 600బస్సులు మహిళా సంఘాలకు యాజమాన్యకు హక్కులను కల్పించారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 45సంఘాలకు ఆ అవకాశం కల్పించారు. ఇప్పటికే 33బస్సులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాలలో ఉన్న మహిళా సంఘాలకు కేటాయించడంతో.. ఆ బస్సులు వివిధ మార్గాల మధ్య తిరుగుతూ ఉన్నాయి.

బస్సుల వివరాలు..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 33బస్సులను కేటాయించారు. ఇందులో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల, సీసీ కుంట, భూత్పూరు, జడ్చర్ల, బాలానగర్, నవాబుపేట, మహబూబ్ నగర్ మండలాల మహిళా సంఘాలకు కేటాయించారు. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు, ఖిల్లా గణపురం, గోపాల్పేట, కొత్తకోట, మదనాపూర్, పెబ్బేరు, పెద్దమందడి మండలాల మహిళా సంఘాలకు, నారాయణపేట జిల్లాలో దామరగిద్ద, మక్తల్, నర్వ, ఉట్కూరు మండలాలకు, నాగర్ కర్నూల్ జిల్లాలో బల్మూరు, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి, తిమ్మాజీపేట, ఉప్పునుంతల, వంగూరు మండలాల మహిళా సంఘాలకు, జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, ఇటిక్యాల, మల్దకల్ మండలాల మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు.

ఆకట్టుకుంటున్న ఇందిరా మహిళా శక్తి పేరు..

మహిళా సంఘాలకు కేటాయించిన బస్సులపై ఉన్న ఇందిరా మహిళా శక్తి అనే పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సులను కేటాయిస్తాము అని చెప్పినప్పుడు.. ఇది సాధ్యమేనా..!? అని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళా సంఘాలకు బస్సులోని కేటాయించి.. వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో.. ఆ బస్సులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులను చేరవేస్తున్నాయి.

Next Story