- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు ఇళ్లల్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ
by Taduka Kalyani |
తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి నగదు, బంగారం దోచుకెళ్లిన సంఘటన ఉప్పునుంతల మండల పరిధి మొలగర గ్రామంలో జరిగింది.

X
దిశ, ఉప్పునుంతల: తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి నగదు, బంగారం దోచుకెళ్లిన సంఘటన ఉప్పునుంతల మండల పరిధి మొలగర గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొలగర గ్రామంలో మాడుగుల బక్కమ్మ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కు వెళ్లింది. కుమ్మరి నిరంజన్ కల్వకుర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. కాగా శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వేసిన తాళం పగులగొట్టి మాడుగుల బక్కమ్మ ఇంట్లో చొరబడి తులంన్నర బంగారం, రూ. 50 వేలు, అలాగే కుమ్మరి నిరంజన్ ఇంట్లో రూ. 10 వేలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ జరుపుతున్నారు.
Next Story






