పాలెంలో ఓ ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ

by Taduka Kalyani |

దుండగలు ఓ ఇంట్లో చొరబడి నగదు, బంగారం అపహరించిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధి పాలెం గ్రామంలో జరిగింది.

పాలెంలో ఓ ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ
X

దిశ, బిజినేపల్లి: దుండగలు ఓ ఇంట్లో చొరబడి నగదు, బంగారం అపహరించిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధి పాలెం గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాలెం గ్రామానికి చెందిన మహమూద్ శుక్రవారం తన బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో కుటుంబంతో కలిసి వెళ్లారు.

శనివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉన్న సమాను చిందర వందరగా పడి ఉండడం గమనించారు. దుండగులు బీరువాలోని రూ. 20,000 నగదు, 8 తులాల బంగారం అపహరించినట్లు గుర్తించారు. దీంతో పోలీస్ స్టేషన్ లో మహమూద్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story